News April 15, 2025
ఆ 4 ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి నారాయణ

మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం నారాయణ అమరావతిలో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదించిన అదనపు భూసేకరణపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని.. సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారన్నారు.
Similar News
News April 19, 2025
ఘోర ప్రమాదం.. కడప ప్రయాణికులు సేఫ్

కడప ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి దాదాపు 20మందితో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కడప నుంచి బయల్దేరింది. గద్వాల(D) ఇటిక్యాల(M) మండలంలోని ప్రియదర్శి హోటల్ వద్ద హైదరాబాద్ నుంచి నంద్యాల వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ దాటి కడప బస్సు పైకి దూసుకొచ్చింది. కారులోని ఇద్దరు చనిపోగా.. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్యామేజ్ కావడంతో కడప ప్రయాణికులను మరో వాహనంలో HYD తరలించారు.
News April 19, 2025
నాగర్‌కర్నూల్: నీ సీఎం కుర్చీ గుంజేస్తాం రేవంత్ రెడ్డి: తీన్మార్ మల్లన్న

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ చైతన్య సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. SLBCలో చనిపోయిన వారిలో ఏడుగురు బీసీలకు ఆయన నివాళులర్పించారు. మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు వెళ్తే ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని గుంజేస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర బీసీ నాయకులు పాల్గొన్నారు.
News April 19, 2025
నంద్యాలకు వెళ్తుండగా యాక్సిడెంట్.. భార్యాభర్తలు మృతి

గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులంతా కలిసి నంద్యాలకు కారులో వెళ్తున్నారు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ప్రియదర్శి హోటల్ ముందు జాతీయ రహదారిపై సోమవారం తెళ్లవారుజామున వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉండగా అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.