News April 15, 2025

సికింద్రాబాద్‌‌లో 6 ప్లాట్‌ఫామ్స్ CLOSE.. చర్లపల్లి నుంచి సేవలు

image

సికింద్రాబాద్‌ స్టేషన్‌‌లో 100 రోజులు 6 ప్లాట్‌ఫామ్‌లు మూసివేస్తారు. రైళ్లను చర్లపల్లికి మళ్లిస్తున్నారు.
ట్రైయిన్‌ల వివరాలు:
APR26:సికింద్రాబాద్-దానపూర్, హైదరాబాద్-రక్సేల్
APR28:దనాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-అగర్తల
APR29:రక్సేల్-సికింద్రాబాద్, ముజఫర్పూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సంత్రాగచి
APR30:సంత్రాగచి-సికింద్రాబాద్
MAY1:సికింద్రాబాద్-ముజర్ఫూర్
MAY2: అగర్తల-సికింద్రాబాద్‌
SHARE IT

Similar News

News April 16, 2025

రంగారెడ్డి: జడ్జీలను ట్రాన్ఫర్ చేస్తూ ఉత్తర్వులు

image

రంగారెడ్డి జిల్లాలో పలువురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో కర్ణకుమార్ రానున్నారు. 1, 2, 4, 9, 11, 12 జిల్లా అదనపు న్యాయమూర్తులను హనుమకొండ, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, భువనగిరికి బదిలీ అయ్యారు.

News April 16, 2025

బాచుపల్లి: నమ్మించి మోసం చేశాడు

image

పెళ్లికాలేదు.. నిన్నే చేసుకుంటా అని నమ్మించి యువతి (21)ని గర్భవతిని చేసి మొహం చాటేశాడో కామాంధుడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా కటకటాల పాలయ్యాడు. సీఐ ఉపేందర్ మాటల్లో.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ (43) మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నాను అంటూ మల్లంపేటలోని హోటళ్లకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేగా మొహం చాటేశాడు.

News April 16, 2025

పబ్‌లో HYD అమ్మాయిలతోనూ డాన్సులు

image

HYD చైతన్యపురిలోని పబ్‌లో యువతులతో <<16103579>>అర్ధనగ్న<<>> డాన్సులు చేయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా..ఇందులో ముంబై యువతులే కాకుండా HYDలోని వనస్థలిపురం, ఉప్పల్, సికింద్రాబాద్ అమ్మాయిలతోనూ డాన్సులు చేయిస్తున్నట్లు గుర్తించారు. యువకులను ఆకర్షించేందుకు పబ్‌లోకి ఫ్రీగా పంపించి, వారికి కంపెనీ ఇస్తూ అధికమొత్తంలో ఖర్చు చేయించి ఆ బిల్ కూడా వారితో కట్టిస్తున్నట్లు అధికారులు తేల్చారు.

error: Content is protected !!