News April 15, 2025
ఆ భూములు మావే.. గ్రామానికి వక్ఫ్ బోర్డు నోటీసులు

TNలోని వేలూర్(D) కట్టుకొల్లాయి గ్రామస్థులకు వక్ఫ్ బోర్డు షాకిచ్చింది. 150 కుటుంబాలున్న ఆ గ్రామ భూములు దర్గాకు చెందినవని, ఖాళీ చేయాలని నోటీసులు పంపింది. ఆందోళనకు గురైన గ్రామస్థులు కలెక్టర్ వద్దకు వెళ్లి 4తరాలుగా అక్కడ జీవిస్తున్నామని, రక్షణ కల్పించాలని కోరారు. కాగా గతంలో తిరుచిరపల్లిలోని 1500 ఏళ్ల నాటి చోళా టెంపుల్‌కు సైతం వక్ఫ్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News April 19, 2025
మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్

చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని మే 2న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, మే 4న బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. వీటితో పాటు రెండో కేదార్‌గా పిలవబడే మద్‌మహేశ్వర ఆలయాన్ని మే 21న, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని వివరించారు. విపరీతమైన మంచు వల్ల వేసవిలో కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి.
News April 19, 2025
RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ రూ.6.83 లక్షల కోట్లు అని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో పసిడి నిల్వలు పెంచుకునేందుకు RBI ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలు పెంచుకుంటున్న క్రమంలో RBI కూడా అదే కోవలో పయనిస్తోంది.
News April 19, 2025
JEE టాప్-10 ర్యాంకర్స్ వీరే

JEE ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. మూడు, నాలుగు ర్యాంకులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు. 1.MD అనాస్, 2.ఆయుష్ సింఘాల్(RJ), 3.అర్చిష్మాన్ నాండీ, 4.దేవదత్త మాఝీ(WB), 5.రవి చౌదరి(MH), 6.లక్ష్య శర్మ(RJ), 7.కుషాగ్ర గుప్తా(KN), 8.హర్ష్ ఏ గుప్తా(TG), 9.ఆదిత్ ప్రకాశ్ భగాడే(GJ), 10.దక్ష్ (DL).