News April 15, 2025
ఢిల్లీలో ఉంటే 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే: గడ్కరీ

ఢిల్లీలో మూడు రోజులు నివసిస్తే జబ్బు చేయడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజధానిలో నెలకొన్న ఎయిర్ పొల్యూషన్‌పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో నివసించేవారికి 10 ఏళ్ల ఆయువు తగ్గినట్లే. ఢిల్లీతోపాటు ముంబైలో కూడా ఇదే పరిస్థితి. దీనిపై అత్యవసర చర్యలు తీసుకోవాలి. ఇంధనాల వాడకాన్ని భారీగా తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News April 19, 2025
నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా

IPLలో ఇవాళ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ.3.30కు అహ్మదాబాద్ వేదికగా టైటాన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇప్పటి వరకూ ఈ రెండింటి మధ్య 5 మ్యాచులు జరగ్గా DC 3, GT 2 సార్లు గెలిచాయి. అలాగే, రాత్రి 7.30కు జైపూర్‌లో రాజస్థాన్, లక్నో బరిలోకి దిగనున్నాయి. ఈ టీమ్స్ గతంలో ఐదుసార్లు తలపడితే రాజస్థాన్(4)దే పైచేయిగా నిలిచింది. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న RR కెప్టెన్ శాంసన్ ఈ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధం నెలకొంది.
News April 19, 2025
మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్

చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని మే 2న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, మే 4న బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. వీటితో పాటు రెండో కేదార్‌గా పిలవబడే మద్‌మహేశ్వర ఆలయాన్ని మే 21న, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని వివరించారు. విపరీతమైన మంచు వల్ల వేసవిలో కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి.
News April 19, 2025
RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు

ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI వద్ద 879 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దీని విలువ రూ.6.83 లక్షల కోట్లు అని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో పసిడి నిల్వలు పెంచుకునేందుకు RBI ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలు పెంచుకుంటున్న క్రమంలో RBI కూడా అదే కోవలో పయనిస్తోంది.