News April 15, 2025

BREAKING.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. నడింపల్లి గ్రామానికి చెందిన వీరయ్యను గ్రామ శివారులోని HYD-అచ్చంపేట రోడ్డుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి హత్య చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని విచారిస్తున్నారు.

Similar News

News December 27, 2025

లేజర్ గన్ ద్వారా 17,491 కేసులు నమోదు: KNR సీపీ

image

ప్రజా స్నేహిత పోలీసింగ్, ఆధునిక సాంకేతికతతో కరీంనగర్ నగరాన్ని మరింత సురక్షితంగా తీర్చిదిద్దుతామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. 2025 వార్షిక నేర సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ఉల్లంఘనపై 3.83 లక్షల ఈ-చలాన్లు, లేజర్ గన్ ద్వారా 17,491 కేసులు నమోదు చేశామన్నారు. పోలీసుల కఠిన చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు స్వల్పంగా తగ్గాయని, నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

News December 27, 2025

KNR: అల్ట్రాసౌండ్ కేంద్రాల్లో డీఎంహెచ్‌ఓ తనిఖీలు

image

కరీంనగర్‌లోని పలు అల్ట్రాసౌండ్, ఫీటల్ మెడిసిన్ కేంద్రాలను DMHO డాక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం రిజిస్టర్లు, ఫామ్-ఎఫ్ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్లు, వైద్యుల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేసిన ఆయన ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

News December 27, 2025

ఏయూ మైదానంలో ప్రారంభమైన శ్రామిక ఉత్సవ్

image

బీచ్ రోడ్‌లోని ఏయు ఎగ్జిబిషన్ మైదానంలోని అఖిలభారత జాతీయ మహాసభలతో పాటు శ్రామిక ఉత్సవ్ కార్యక్రమాన్ని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు. వచ్చి నెల 2వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవం కార్యక్రమంలో పలు సాంకేతిక ప్రదర్శనలు జాతీయస్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి నరసింగరావు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మురళి హాజరు అయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో పుస్తక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.