News April 15, 2025
డబ్బు కాదు విధేయత ముఖ్యం.. అందుకే KKRను వీడలేదు: రమణ్‌దీప్

KKR తనను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోవడం వెనుక ఉన్న కథను రమణ్‌దీప్ వెల్లడించారు. వేలానికి ముందు రిటైన్‌కు ఒప్పుకోవద్దని, రూ.9-10 కోట్లతో కొనుగోలు చేస్తామని చాలా టీమ్స్ ఆఫర్ ఇచ్చాయన్నారు. అయితే తనకు తొలుత అవకాశం ఇచ్చిన KKRపై విధేయత ఉందని చెప్పారు. అందుకే డబ్బు తక్కువైనా టీమ్‌లోనే ఉంటానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలిపారు. వేలంలోకి వెళితే ఇదే జట్టులోకి వస్తాననే గ్యారంటీ లేదన్నారు.
Similar News
News March 12, 2026
చిప్ తయారీ కోసం కేంద్రం ₹లక్ష కోట్ల ఫండ్?

ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో వాడే చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ₹లక్ష కోట్లను కేటాయించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫండ్‌తో చిప్ డిజైన్ ప్రాజెక్టులు, తయారీ పరికరాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సబ్సిడీలను కల్పించనుంది. చిప్ తయారీ కోసం ₹4లక్షల కోట్లను కేటాయించిన US తరహాలోనే ఈ పాలసీతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. మరో 2 లేదా 3 నెలల్లో ఇది లాంచ్ కావొచ్చని సమాచారం.
News March 12, 2026
The Hundred: పాక్ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ కొనడంపై విమర్శలు!

ఇంగ్లండ్ టోర్నీ The Hundred వేలంలో పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ₹2.34 కోట్లకు అతడిని దక్కించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఇది సిగ్గు చేటని ఫైరవుతున్నారు. ఇండియాను, ఆర్మీని ఎగతాళి చేసే వ్యక్తిని తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. IPL అనుబంధ ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లను అవైడ్ చేస్తాయని ఇటీవల వార్తలొచ్చాయి.
News March 12, 2026
రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు

TG: మండుతున్న ఎండలు, ఉక్కపోతకు ఉపశమనం కలిగించేలా రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది. అప్పటివరకు ఎండలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది.


