News March 27, 2024
లైసెన్సు కలిగిన ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి: ఎస్పీ

పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో లైసెన్సు కలిగిన ఆయుధాలు వెంటనే డిపాజిట్ చేయాలి జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా పరిధిలోని మొత్తం 136 ఆయుధాలు లైసెన్స్ లు కలిగి ఉన్నాయని, వాటిని వెంటనే సమీప పోలీసు స్టేషన్‌లో లేదా జిల్లా పోలీసు కార్యాలయంలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీచేశారు.
Similar News
News March 28, 2026
NLG: ముందస్తుగా పాఠ్య పుస్తకాలు.. ఈసారి బార్‌కోడ్!

జిల్లాలో పాఠశాలల ప్రారంభం నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 5.60 లక్షల పుస్తకాలు అవసరం కాగా..ఇందులో ఇప్పటి వరకు 1.64 లక్షల పుస్తకాలు ఇప్పటికే చేరాయి. పుస్తకాల సరఫరాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రతీ పుస్తకానికి ప్రత్యేక కేటాయించి నమోదు చేస్తున్నారు.
News March 27, 2026
మిర్యాలగూడ పార్లమెంటు స్థానంపై చర్చ..!

నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మిర్యాలగూడ పార్లమెంటు స్థానాన్ని పునరుద్ధరించాలని చర్చ మొదలైంది. 2008లో ఈ స్థానాన్ని నల్గొండలో కలిపిన సంగతి తెలిసిందే. 1962 నుంచి 2004 వరకు ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడను తిరిగి లోక్‌సభ స్థానంగా మార్చాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
News March 27, 2026
NLG: వేసవిలో విద్యుత్ కష్టాలకు చెక్.. ‘పవర్’ ఫుల్ ప్లాన్

వేసవిలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా నల్గొండ జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఇది 22 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా. లోడ్ తట్టుకునేందుకు సబ్‌స్టేషన్లలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ ప్రాంతాల్లో సామర్థ్యాన్ని పెంచారు.


