News April 15, 2025
KMR: టీటీడీ ఛైర్మన్‌కు VHP ఆధ్వర్యంలో వినతి

కామారెడ్డి జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని సిద్దిరామేశ్వర,కాలభైరవ,లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల అభివృద్ధిని కోరుతూ మంగళవారం తిరుమలతిరుపతిలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు.TTD ఛైర్మన్ స్పందిస్తూ దేవాలయాల అభివృద్ధికి అంచనావేసి పరిశీలిస్తామన్నారు. కలిసిన వారిలో కామారెడ్డి VHP నగరాధ్యక్షుడు వెంకటస్వామి,BJP రాష్ట్రనాయకుడు రణజిత్ మోహన్ ఉన్నారు.
Similar News
News April 19, 2025
రామప్ప కనుమరుగయ్యే అవకాశం ఉంది: పాండురంగారావు

సింగరేణి ఓపెన్ కాస్ట్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే రాబోయే రోజుల్లో రామప్ప ఆలయం కనుమరుగయ్యే అవకాశం ఉందని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. వెంకటాపూర్‌లోని ఆలయాన్ని సందర్శించి వారు మాట్లాడారు. రామప్ప దేవాలయం పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగి, వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం జిల్లాకే గర్వకారణమన్నారు.
News April 19, 2025
ఫార్ములా ఈ-రేసు కేసు.. రెండో విడత దర్యాప్తు!

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో రెండో విడత దర్యాప్తు కోసం ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన అధికారులు, మరో 10 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించాలని నిర్ణయించారు. HMDA బోర్డు నిధుల నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
News April 19, 2025
పాలమూరు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

పాలమూరు విశ్వవిద్యాలయం ఏప్రిల్/మే 2025కు సంబంధించిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. సెమిస్టర్-II, IV, VI (రెగ్యులర్/బ్యాక్‌లాగ్), డిగ్రీ బీ.కామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూతో పాటు యూజీ కోర్సులు పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేశామని, https://www.palamuruuniversity.com/ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు. ఈనెల 28 నుంచి పరీక్షలు ప్రారంభమవనున్నట్లు చెప్పారు. SHARE IT