News April 15, 2025

బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటన.. షెడ్యూల్

image

భారత సీనియర్ మెన్స్ జట్టు ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టులో జరిగే ఈ పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది. మిర్పూర్ వేదికగా 17, 20 తేదీల్లో తొలి రెండు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 23న చట్టోగ్రామ్‌లో 3 వన్డే ఆడనుంది. ఆ తర్వాత తొలి T20 ఆగస్టు 26న చట్టోగ్రామ్‌లో, మిగతా రెండు T20లను ఆగస్టు 29, 31 తేదీల్లో మిర్పూర్ వేదికగా ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది.

Similar News

News November 8, 2025

రబీ శనగ సాగుకు అనువైన రకాలు

image

రబీలో నవంబర్ 15 లోపు వరకు శనగ పంటను విత్తుకోవచ్చు.
☛ రబీకి అనువైన దేశీ శనగ రకాలు నంద్యాల శనగ-1, జెబి-11, జెఎకెఐ-9218, జెబి-130, ధీర, నంద్యాల గ్రామ్-49, నంద్యాల గ్రామ్- 452, నంద్యాలగ్రామ్-776(N.B.E.G)-776.
☛ కాబులి రకాలు: కెఎకె-2, పూలెజి-95311, లాం శనగ-7 (ఎల్‌బిఇజి-7), నంద్యాల గ్రామ్-119(N.B.E.G-119), నంద్యాల గ్రామ్-810 (N.B.E.G-810)

News November 8, 2025

గర్భిణులు-తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు

image

మహిళలు ప్రెగ్నెన్సీ ముందు, తర్వాత కొన్నిటీకాలు తీసుకోవాలి. వీటివల్ల తల్లీబిడ్డకు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడే మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్ పాక్స్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత HPV, DPT, హెపటైటిస్ బి, కోవిడ్, రెస్పిరేటరీ సిన్సీపియల్ వైరల్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొందరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లు మరికొన్ని వ్యాక్సిన్లు సూచిస్తారు.

News November 8, 2025

ఇవాళ్టి బంగారం, వెండి ధరలిలా

image

రెండో శనివారం సందర్భంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020గా ఉంది. అటు వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గడం విశేషం. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,11,850గా ఉంది. అటు కేజీ వెండి ధర రూ. 1,65,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.