News April 15, 2025

సిరిసిల్ల: నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఎంపికకు కట్టుదిట్టమైన కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు ఉండవద్దన్నారు.

Similar News

News November 8, 2025

కృష్ణా: అలర్ట్..పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు డిసెంబర్ 2 నుంచి నిర్వహిస్తామని..పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా NOV 17లోపు, రూ. 200 ఫైన్‌తో NOV 19లోపు ఫీజు చెల్లించాలని KRU పరీక్షల విభాగం సూచించింది.

News November 8, 2025

MP సాన సతీశ్‌పై CM చంద్రబాబు ఆగ్రహం!

image

AP: గన్నవరం విమానాశ్రయంలో WC విన్నర్ శ్రీ చరణికి స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. విమానాశ్రయానికి మంత్రులు, శాప్, ACA ప్రతినిధులు వెళ్లారు. శ్రీ చరణి ఉన్న లాంజ్‌లోకి BCCI మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్‌ని ప్రోటోకాల్ పోలీసులు వెళ్లనివ్వలేదు. దీనిపై MSKతో CM మాట్లాడారు. MP, ACA సెక్రటరీ సానా సతీశ్‌పై CM ఆగ్రహించినట్లు సమాచారం. ఇలాంటివి రిపీటవ్వకుండా చూసుకోవాలని ACAను ఆదేశించారు.

News November 8, 2025

నవంబర్ 8: చరిత్రలో ఈరోజు

image

1948: గాంధీని హత్య చేసినట్లు అంగీకరించిన గాడ్సే
2016: పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
1656: తోకచుక్కను కనుగొన్న సైంటిస్ట్ ఎడ్మండ్ హేలీ జననం
1927: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ జననం
1969: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జననం
1977: డైరెక్టర్ బీఎన్ రెడ్డి మరణం
2013: కమెడియన్ ఏవీఎస్ మరణం