News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

Similar News

News April 19, 2025

కొల్లూరు వాసికి డాక్టరేట్

image

నవాబుపేట మండలం కొల్లూరు సత్రోనిపల్లి తండాకు చెందిన జర్నలిస్ట్ మల్లికార్జున్ నాయక్‌‌ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ యూనివర్సిటీ వారు ఆయనకు శుక్రవారం డాక్టరేట్ ప్రదానం చేశారు.  మల్లికార్జున్ నాయక్ మాట్లాడుతూ.. తాను జర్నలిస్టుగా ఎన్నో ఆలోచనాత్మక కథనాలు, అలాగే తాను సామాజిక కార్యక్రమాలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. 

News April 19, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔జోగులాంబ శక్తి పీఠంలో చండీహోమాలు ✔పెబ్బేరు: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి ✔ఆత్మకూరు: కట్టర్ బార్ మీద పడి ఒకరి మృతి
✔ఉమ్మడి జిల్లాలో భానుడి భగభగ
✔తెల్కపల్లి: ప్రేమ వివాహం.. అత్తారింటి వేధింపులు
✔పలుచోట్ల భారీ వర్షం
✔గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి
✔మల్లీశ్వరిది ప్రభుత్వ హత్యనే:BRS
✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్

News April 18, 2025

మహబూబ్‌నగర్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు SBI RSETI సంస్థ డైరెక్టర్ జీ.శ్రీనివాస్ తెలిపారు. సెల్ ఫోన్ సర్వీస్ & రిపేరింగ్ కోర్సులో ఈనెల 21లోగా SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉచిత శిక్షణ, భోజనం, వసతి ఉంటుందన్నారు. వయస్సు 19-45 ఏళ్లలోపు ఉండాలన్నారు.మిగతా వివరాలకు 95424 30607, 99633 69361 సంప్రదించాలన్నారు. #SHARE IT

error: Content is protected !!