News March 27, 2024

విశాఖ: ఎన్నికల ఏర్పాట్లపై ప్రధాన అధికారి సమీక్ష

image

విజయవాడ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సి విజిల్ ఫిర్యాదులు పరిష్కారం ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ తదితరులు ఎన్నికల నిర్వహణపై వివరించారు.

Similar News

News March 17, 2026

విశాఖ నుంచి బెంగళూరు, చర్లపల్లి రైళ్లు క్రమబద్ధీకరణ

image

విశాఖపట్నం నుంచి నడిచే రెండు ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే క్రమబద్ధీకరించింది. విశాఖ-SMVT బెంగళూరు (18509/10) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం, విశాఖ-చర్లపల్లి (18527/28) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటాయి. బెంగళూరు రైలు రేణిగుంట మీదుగా, చర్లపల్లి రైలు వరంగల్ మీదుగా ప్రయాణిస్తాయి. ప్రయాణికులు ఈ శాశ్వత సేవలను వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది.

News March 17, 2026

జీవీఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన చరిత్ర(2/2)

image

విశాఖ జీవీఎంసీలో పలుమార్లు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 2000-2007 ఏళ్ల మధ్య ఎక్కువ కాలం ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 2012 నుంచి 2021 వరకు సుమారు 9 ఏళ్లపాటు కూడా ఎన్నికలు జరగక జిల్లా కలెక్టర్లే ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. ఈ సమయంలో కార్పొరేషన్‌ పాలన, అభివృద్ధి పనులు అధికారుల ఆధ్వర్యంలోనే సాగాయి. 2021లో ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు చేపట్టి అయిదేళ్ల ప్రయాణం పూర్తి చేశారు.

News March 17, 2026

జీవీఎంసీలో ప్రత్యేక పాలన అమలు(1/2)

image

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌(జీవీఎంసీ)లో ఎన్నికైన మేయర్‌తో పాటు కార్పొరేటర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలన అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎన్నికైన ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో కార్పొరేటర్ల అధికారాలు కూడా ముగిశాయి.