News April 15, 2025
BREAKING: ఈ నెల 26న అకౌంట్లోకి రూ.20,000

AP: మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చేపల వేట నిషేధ సమయంలో వారికి అందించే రూ.10,000 సాయాన్ని రూ.20,000కు పెంచుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఈ సాయం అందిస్తామన్నారు. ఓ మత్స్యకార గ్రామంలో సీఎం పర్యటిస్తారని, త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేస్తామని నిమ్మల పేర్కొన్నారు.
Similar News
News April 19, 2025
ప్రాజెక్ట్ చీతా: భారత్‌కు మరో 8 చిరుతలు

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్ మరో 8 చిరుతలను సౌథర్న్ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకురానుంది. తొలి దశలో బోత్స్వానా నుంచి వచ్చే నెలలో నాలుగు చిరుతలు వస్తాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అధికారులు తెలిపారు. 2022లో నమీబియా నుంచి 8, 2023లో SA నుంచి 12 చిరుతల్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో(MP) మొత్తం 26 చిరుతలు ఉన్నాయి.
News April 19, 2025
ఒకే రోజున పవన్-విజయ్ సినిమాలు రిలీజ్?

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. తొలుత మే 9న ‘HHVM’ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా వివిధ కారణాలతో పోస్ట్‌పోన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మధ్యలో పవన్ డేట్స్ ఇచ్చి, షూటింగ్ పూర్తయితే ఈ చిత్రాన్ని మే 30న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేరోజున ‘కింగ్డమ్’ కూడా రానుంది.
News April 19, 2025
కొబ్బరి కాయలో నీళ్లు ఎలా వస్తాయి?

కొబ్బరికాయలో ఎక్సోకార్ప్(పచ్చని పైపొర), మీసోకార్ప్(పీచు), ఎండోకార్ప్(టెంక) అనే 3 పొరలుంటాయి. ఎండోకార్ప్‌లో ఎండోస్పెర్మ్(ముదిరాక కొబ్బరి), నీళ్లు అనే రెండు భాగాలుంటాయి. కొబ్బరి చెట్టులోని వాస్క్యులర్(రవాణా) వ్యవస్థ వేళ్ల నుంచి ఖనిజాలు కలిగిన భూగర్భ జలాలను జైలమ్ నాళాల ద్వారా టెంకలోకి చేరుస్తుంది. వాటినే కొబ్బరి నీళ్లు అంటాం. కాయ ముదిరే కొద్ది నీరే కొబ్బరిగా మారుతూ ఉంటుంది.