News April 15, 2025

ఏపీ నుంచి ఏపీకి వయా HYD.. గంటా ఆవేదన

image

AP: వైజాగ్ నుంచి అమరావతికి వెళ్లాలంటే హైదరాబాద్‌ మీదుగా వెళ్లాల్సి రావడంపై TDP ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉదయం 8 గంటలకు విశాఖలో బయలుదేరి హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటిగంట అయ్యింది. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం నడిచే 2 విమానాలు రద్దు కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణికుల దుస్థితి’ అని ఆయన వాపోయారు.

Similar News

News April 19, 2025

ప్రాజెక్ట్ చీతా: భారత్‌కు మరో 8 చిరుతలు

image

ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారత్ మరో 8 చిరుతలను సౌథర్న్ ఆఫ్రికా దేశాల నుంచి తీసుకురానుంది. తొలి దశలో బోత్స్వానా నుంచి వచ్చే నెలలో నాలుగు చిరుతలు వస్తాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) అధికారులు తెలిపారు. 2022లో నమీబియా నుంచి 8, 2023లో SA నుంచి 12 చిరుతల్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో(MP) మొత్తం 26 చిరుతలు ఉన్నాయి.

News April 19, 2025

ఒకే రోజున పవన్-విజయ్ సినిమాలు రిలీజ్?

image

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. తొలుత మే 9న ‘HHVM’ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా వివిధ కారణాలతో పోస్ట్‌పోన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ మధ్యలో పవన్ డేట్స్ ఇచ్చి, షూటింగ్ పూర్తయితే ఈ చిత్రాన్ని మే 30న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదేరోజున ‘కింగ్డమ్’ కూడా రానుంది.

News April 19, 2025

కొబ్బరి కాయలో నీళ్లు ఎలా వస్తాయి?

image

కొబ్బరికాయలో ఎక్సోకార్ప్(పచ్చని పైపొర), మీసోకార్ప్(పీచు), ఎండోకార్ప్(టెంక) అనే 3 పొరలుంటాయి. ఎండోకార్ప్‌లో ఎండోస్పెర్మ్(ముదిరాక కొబ్బరి), నీళ్లు అనే రెండు భాగాలుంటాయి. కొబ్బరి చెట్టులోని వాస్క్యులర్(రవాణా) వ్యవస్థ వేళ్ల నుంచి ఖనిజాలు కలిగిన భూగర్భ జలాలను జైలమ్ నాళాల ద్వారా టెంకలోకి చేరుస్తుంది. వాటినే కొబ్బరి నీళ్లు అంటాం. కాయ ముదిరే కొద్ది నీరే కొబ్బరిగా మారుతూ ఉంటుంది.

error: Content is protected !!