News April 15, 2025

NTR: సీఎం పర్యటన ప్రాంతం పరిశీలన: సీపీ

image

ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ భవానిపురం బేరం పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. అదేవిధంగా బందోబస్తు ఏర్పాటులపై అధికారులకు, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. పార్కింగ్ ప్రదేశాలు, పరిసర ప్రాంతాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ తెలిపారు.

Similar News

News December 28, 2025

త్వరలో కరెంట్ బిల్లులు తగ్గే ఛాన్స్!

image

విద్యుత్ ట్రేడింగ్ ఎక్స్‌ఛేంజ్‌లు వసూలు చేసే ఛార్జీలపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సమీక్షిస్తోంది. 2026లో అమలులోకి వస్తున్న మార్కెట్ కప్లింగ్ విధానంతో అన్ని ఎక్స్‌ఛేంజీలు ఒకే రేట్ వసూలు చేయాలి. ప్రస్తుతం యూనిట్‌కు 2పైసలుగా ఉన్న ట్రాన్సాక్షన్ ఫీజును 1.5/1.25పైసలకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో డిస్కంలు తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేస్తే సామాన్యులకు కరెంట్ బిల్ తగ్గుతుంది.

News December 28, 2025

గాదె ఇన్నయ్య ‘మా ఇల్లు’కు మంత్రి సీతక్క

image

TG: జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లోని <<18631208>>గాదె ఇన్నయ్య <<>>నిర్వహిస్తున్న ‘మా ఇల్లు’ అనాథాశ్రమాన్ని మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. ఇన్నయ్యను మిస్ అవుతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్న పిల్లలను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. చదువుకు, బసకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సాగరం గ్రామంలోని ఇన్నయ్య ఇంటికి వెళ్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు.

News December 28, 2025

విశాఖ: ‘స్త్రీ శక్తి’ పథకం ఎఫెక్ట్.. 75%కి పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య

image

విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గాజువాక, స్టీల్ సిటీ డిపోలను శనివారం తనిఖీ చేశారు. ‘స్త్రీ శక్తి’ పథకంతో జిల్లాలో మహిళా ప్రయాణికుల సంఖ్య 75%కి పెరిగిందని, దీనివల్ల టికెట్ మిషన్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కండక్టర్లకు 20,000 mAh పవర్ బ్యాంక్స్‌ పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎంఈ గంగాధర్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.