News April 15, 2025

HYDలో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం

image

HYDలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో నగరవాసులు అల్లాడిపోయారు. మ.3 తర్వాత వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం లభించిందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఆకాశం మబ్బులతో చల్లని గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే పాతబస్తీ, ఖైరతాబాద్, KPHB, ప్యాట్నీ, సికింద్రాబాద్, ఎల్బీనగర్, హయత్‌నగర్‌ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

Similar News

News July 9, 2025

ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం ఎత్తివేసే కుట్ర: ఆర్.కృష్ణయ్య

image

కాలేజ్ విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగా ట్రస్ట్ బ్యాంక్ నిధి అనే సరికొత్త ప్రతిపాదన కాలేజీ యాజమాన్యాల ద్వారా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.

News July 8, 2025

HYD: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఓయూ వీసీ

image

TG హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం కలిశారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో బాబాసాహెబ్ డా.BR అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై ఈనెల 12న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో భారత ప్రధాన న్యాయమూర్తి ప్రసంగించనున్నారు. దీంతో హైకోర్టు ప్రాంగణంలో కలసి ఆహ్వానించారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఉన్నారు.

News July 8, 2025

నాంపల్లిలో ఏసీబీకి చిక్కిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి

image

GST రిజిస్ట్రేషన్ కోసం రూ.8 వేలు లంచం డిమాండ్ చేసిన మాదాపూర్ సర్కిల్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ సుధారెడ్డి ACB అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాంపల్లి గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడుల చేశారు. కంపెనీ అభ్యర్థనపై రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం లంచం కోరినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.