News April 15, 2025
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన బాపట్ల విద్యార్థి

బల్లికురవ మండలంలోని వల్లాపల్లి ఎంపీయూపీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న మందా వివేక్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. హోలెల్ మ్యూజిక్ స్కూల్ తరఫున నిర్వహించిన బృందం సంగీతంలో వివేక్ సత్తా చాటాడు. హైదరాబాద్ హోలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వాహకులు విద్యార్థికి సోమవారం మెడల్, సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో విద్యార్థిని సిబ్బంది, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News January 9, 2026
కల్తీ ఆహారం అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

ప్రజలకు సురక్షిత ఆహారం అందించేందుకు హోటళ్లు, దాబాలపై విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్‌వాడీల నుంచి ఆహార శాంపిళ్లు సేకరించి పరీక్షించాలని సూచించారు. కల్తీకి పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని, ప్రతి వ్యాపారి తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆయన పేర్కొన్నారు.
News January 9, 2026
NTR జిల్లాలో సెక్షన్ 30 యాక్ట్ అమలు: CP

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈనెల 10 నుంచి ఏప్రిల్ 9 వరకు NTR జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని CP రాజశేఖర్ బాబు శుక్రవారం తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజా
ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
News January 9, 2026
ఈ OTTలోకి ప్రభాస్ ‘రాజాసాబ్’

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజాసాబ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. హారర్ కామెడీ జానర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు.


