News April 15, 2025
ఓపెన్ స్కూల్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ పమేలా

కరీంనగర్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారంతా శ్రద్ధతో చదివి 100 శాతం ఫలితాలు సాధించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా, ఉపాధి అవకాశాలకైనా విద్యార్హతలు ముఖ్యమని కలెక్టర్ అన్నారు.
Similar News
News January 20, 2026
KNR: ఎన్నికల విధులకు 12 మంది నోడల్ అధికారులు

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ పమేలా సత్పతి 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మీడియా పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలను వీరికి అప్పగించారు.
News January 20, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలు.. రంగంలోకి మంత్రి తుమ్మల!

కరీంనగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ కోసం కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు మక్కువ చూపుతున్నారు. పలువురు టికెట్ల కోసం.. మంత్రులు, వివిధ హోదాలో ఉన్న వారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనికి చెక్కు పెడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఇంఛార్జ్‌గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించింది.
News January 20, 2026
కరీంనగర్: ప్రయోగశాలల సామగ్రికి టెండర్ల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగ సామగ్రి పంపిణీ కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఐఈఓ వి.గంగాధర్ తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం, ఫిబ్రవరి 2 నుంచి జరిగే ప్రయోగ పరీక్షల నిమిత్తం ఈ ప్రక్రియ చేపట్టారు. ఆసక్తి గల పంపిణీదారులు పద్మనగర్‌లోని డీఐఈఓ కార్యాలయంలో సంప్రదించి కొటేషన్లు సమర్పించాలన్నారు.


