News March 27, 2024

BREAKING: పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు కీలక ఆదేశాలు

image

AP: ఏప్రిల్, మే నెలల పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వాలంటీర్లకు సెర్ప్ కీలక ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా ఆథరైజేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పింది. పంపిణీ సమయంలో ఎన్నికల ప్రచారం చేయొద్దని.. ఫొటోలు, వీడియోలు తీయొద్దని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ప్ స్పష్టం చేసింది.

Similar News

News March 18, 2026

ఉగాది ముహూర్తం.. సమయం ఇదే..

image

రేపటి నుంచి ‘పరాభవ’ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. గురువారం ఉ.6 గం.53 ని.ల నుంచి ఉ.9.30 వరకు అత్యంత శ్రేష్ఠ ముహూర్తం ఉందని పండితులు తెలిపారు. ఈ సమయంలో పంచాంగం వినడంతో పాటు కొత్త పనులు ప్రారంభించాలని సూచించారు. తెల్లవారుజామునే నూనెతో స్నానం చేసి, ఉగాది పచ్చడి తాగాలని తెలిపారు. ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలని పేర్కొన్నారు.

News March 18, 2026

త్వరలో విశాఖ రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం

image

AP: విశాఖ రైల్వే జోన్ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. జనరల్ మేనేజర్ (GM) సహా ఇతర ఉన్నతాధికారుల నియామక ప్రక్రియ పూర్తయ్యిందని పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జోన్ ప్రధాన కార్యాలయం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎర్రుపాలెం – అమరావతి – నంబూరు మధ్య 57KM కొత్త రైల్వే లైన్ కోసం రూ. 2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.

News March 18, 2026

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం: సీఎం

image

TG: అసెంబ్లీకి రాని వారికి జీతాలు ఇవ్వాలా? వద్దా? అనే దానిపై చర్చ జరగాలని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేసీఆర్ సభకు రాకపోయినా రూ.1.06 కోట్ల జీతం తీసుకున్నారని తెలిపారు. ప్రజల సొమ్ము తీసుకుంటూ సభకు హాజరుకాకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రైజింగ్ తెలంగాణ-2047 డాక్యుమెంట్‌ను కూడా ప్రతిపక్ష సభ్యులు చదవలేదని విమర్శించారు.