News April 15, 2025

వరంగల్: పలు జిల్లాలకు వర్ష సూచన

image

మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామతో పాటు వరంగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం, రాత్రి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్రమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. 

Similar News

News November 6, 2025

రాష్ట్ర స్థాయి చెస్ టోర్నీకి వరంగల్ వేదిక

image

వరంగల్ జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నీ నిర్వహించనున్నట్లు కార్యదర్శి కన్నా తెలిపారు. బాలబాలికల విభాగంలో రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయని, విజేతలకు నగదు బహుమతులు, మెడల్స్‌, ప్రశంసాపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.

News November 6, 2025

రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్: ఫతి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కాలేజీలు మూతబడి 4 రోజులు అవుతోంది. రూ.10వేల కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో రూ.5వేల కోట్లు విడుదల చేసే వరకు బంద్ కొనసాగుతుందని ‘ఫతి’ స్పష్టం చేసింది. మిగతా రూ.5వేల కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలంది. అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని.. అందుకే బంద్‌కు దిగాల్సి వచ్చిందని పేర్కొంది.

News November 6, 2025

ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

image

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.