News April 15, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 పోస్టులు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 199 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 117 SGT(ప్రాథమిక స్థాయి), 82 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News October 27, 2025
భువనగిరి: నేడే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

భువనగిరి జిల్లాలో నూతన మద్యం దుకాణాల ఎంపిక ప్రక్రియను ఇవాళ నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,776 దరఖాస్తులు వచ్చాయి. రాయగిరిలోని సోమ రాధాకృష్ణ హాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. దరఖాస్తుదారులు ఉదయం 9 గంటలలోపు తమ పాసులు, ఐడీ కార్డులతో హాలుకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
News October 27, 2025
తుఫాన్ హెచ్చరిక.. మండలాలకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం!

మొంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముందస్తు చర్యలలో భాగంగా తీర ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను ఆదివారం నియమించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయగా తీర ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, కొత్తపట్నం, నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పలువురు పోలీస్ అధికారులను నియమించారు.
News October 27, 2025
నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్

నెల్లూరు జిల్లాలో చెదురు మొదరు చినుకులుగా ప్రారంభమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘గంటకు 45–55 కి.మీ వేగంతో వీచే గాలులు, కొన్ని చోట్ల 65 కి.మీ వరకు వేగం చేరే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల గాలివానలు సంభవించవచ్చు’ అని పేర్కొంది.


