News April 15, 2025
నారాయణపేట: సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న నోవాటెల్ హోటల్‌లో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సహచర ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పథకాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని ఎమ్మెల్యే అన్నారు.
Similar News
News January 15, 2026
ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు.
News January 15, 2026
ఐఐటీ రూర్కీలో నాన్ టీచింగ్ పోస్టులు

<
News January 15, 2026
సంక్రాంతి: నువ్వుల లడ్డూ తిన్నారా?

సూర్యుడు తన కుమారుడైన శనిదేవుని ఇంటికి వెళ్లే రోజే సంక్రాంతి. శనిదేవుడు నల్ల నువ్వులతో తండ్రిని పూజించడంతో వారి మధ్య వైరం తొలగిపోయింది. అందుకే నేడు నువ్వులు తినాలని పండితులు, పెద్దలు చెబుతారు. దీనివల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శాస్త్రీయంగా చూసినా చలికాలంలో వాటిని తింటే అనేక లాభాలున్నాయి. రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే పండక్కి నువ్వుల లడ్డూలు చేస్తారు. మరి మీరు తిన్నారా? COMMENT


