News April 15, 2025
SKLM: పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో భూ పరిపాలన, తాగునీటి సరఫరా, ఐసీడీఎస్, గ్రామ సచివాలయాల పనితీరు వంటి కీలక అంశాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
Similar News
News January 13, 2026
మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.
News January 13, 2026
కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.


