News April 15, 2025

ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డుకు సీపీ సన్మానం

image

ఖమ్మం: ఉద్యోగ విరమణ పొందిన సత్తుపల్లి యూనిట్ హోంగార్డు ఆఫీసర్ మిట్టపల్లి వాణిని మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో బాధ్యతాయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ఎనలేని సేవలతో పోలీస్ అధికారుల మన్ననలు పొందారని సీపీ కొనియాడారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.

Similar News

News November 9, 2025

కరీంనగర్: జాతీయ స్థాయికి ఒగ్గుడోలు విద్యార్థులు

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కళా ఉత్సవ్- 2025లో రాష్ట్రస్థాయిలో విజయం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పదో తరగతి చదువుతున్న రోహిత్, ఆశిష్, రిత్విక్, హర్షిత్ గ్రామీణ సాంప్రదాయ ఒగ్గుడోలు కళా ప్రదర్శనలో ప్రతిభ చాటారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు పక్కా: జగ్గారెడ్డి

image

జూబ్లీహిల్స్​ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్​ యాదవ్​ పక్కా గెలుస్తాడని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుందని, పథకాలతో పాటు అభివృద్దికి పెద్దపీట వేస్తుందన్నారు. అందుకే జూబ్లీహిల్స్​ ప్రజలు ఆలోచించి అందరూ కలిసి నవీన్​ యాదవ్‌‌ను గెలిపించాలని ఓటర్లు జగ్గారెడ్డి కోరారు. ఉప ఎన్నిక సమయం దగ్గర పడటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి.

News November 9, 2025

పాటీదార్‌కు గాయం.. 4 నెలలు ఆటకు దూరం!

image

భారత ప్లేయర్ రజత్ పాటీదార్ నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా-ఏతో జరిగిన తొలి అన్‌అఫీషియల్ టెస్టులో ఆయన గాయపడినట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆడట్లేదని పేర్కొన్నాయి. ఈ కారణంతో ఈ నెలాఖరు, డిసెంబర్‌లో జరిగే దేశవాళీ టోర్నీలకు ఆయన దూరం కానున్నారు. మరోవైపు పాటీదార్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.