News March 27, 2024
రూ.100 కోట్లకు ఎంపీ స్థానాన్ని అమ్ముకున్న బీఆర్ఎస్: రఘునందన్ రావు

మెదక్ పార్లమెంటు స్థానాన్ని రూ.100 కోట్లకు బీఆర్ఎస్ అమ్ముకుందని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై మాజీ మంత్రి హరీశ్ రావు పెత్తనం చేయడం సరికాదని చెప్పారు. దమ్ముంటే సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
Similar News
News March 31, 2026
పథకాల వివరాలు ప్రజలకు వివరించాలి: భట్టి విక్రమార్క

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. గ్రామ సభల ద్వారా ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు.
News March 31, 2026
మెదక్: 33మంది హజ్ యాత్రికులకు టీకా

మెదక్ జిల్లా నుంచి ఎంపికైన 33 మంది హజ్ యాత్రికులకుమంగళవారం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక “టీకా శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరంలో యాత్రికులకు సంబంధించిన అన్ని రకాల అవసరమైన వైద్య పరీక్షలు చేసి టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సునీతా దేవి, జిల్లా వ్యాక్సిన్ అధికారి మాధురి, జిల్లా హజ్ కో-ఆర్డినేటర్ మహమ్మద్ ఎజాజుద్దీన్ పాల్గొన్నారు.
News March 31, 2026
హనుమాన్ జయంతికి పోలీసు బందోబస్తు: ఎస్పీ

హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని హనుమాన్ దేవాలయాలు, ఊరేగింపు మార్గాలు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.


