News April 15, 2025
నిబద్ధతతో పని చేయాలి: MHBD ఎస్పీ

పోలీసు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే నిబద్ధతతో పని చేయాలని MHBD ఎస్పీ రామ్నాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్‌లో కోర్టు డ్యూటీ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. కోర్టు డ్యూటీలో నిర్లక్ష్యం వహించకూడదని, కేసు ఛార్జి షీట్లను నిర్దేశిత కాలంలో న్యాయస్థానాలకు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
ట్రంప్ వద్దంటున్నా.. ఇరాన్‌పై దాడికే ఇజ్రాయెల్ మొగ్గు

ఇరాన్‌పై దాడి వద్దని ఓవైపు అమెరికా వారిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. వచ్చే నెలల్లో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఇరాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉండొద్దనేదే తమ లక్ష్యమని వివరించారు. అటు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ను దాడి చేయొద్దని వారిస్తున్నట్లు తెలుస్తోంది.
News April 19, 2025
చీపురు పట్టి శుభ్రం చేసిన అనకాపల్లి ఎస్పీ

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి పోలీస్ కార్యాలయం ఆవరణలో శనివారం శ్రమదానంతో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి శుభ్రం చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా చీపురు పట్టి కార్యాలయం ప్రాంగణంలో శుభ్రం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. స్వచ్ఛతే ఆరోగ్యానికి నాందిగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
News April 19, 2025
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు ఆయన ఉన్న హోటల్‌పై రైడ్ చేశారు. వారిని చూసి చాకో పరారయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలింపు చేపట్టి, తాజాగా కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు. చాకో తెలుగులో దసరా, దేవర, రాబిన్‌హుడ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.