News March 27, 2024

ప్రభుత్వ ఆసుపత్రులలో 100శాతం ప్రసవాలకు కృషి చేయాలి: కలెక్టర్

image

ప్రభుత్వ, ప్రైవేటు వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రసూతి మాతృ మరణాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని, ముందస్తుగా వారి ఆరోగ్య పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన వైద్యం అందించాలని ఆదేశించారు. 6ప్రసూతి మరణాలకు సంబంధించి విచారణ చేపట్టారు. 

Similar News

News March 7, 2026

మహిళా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న జిల్లావ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. భీమవరంలోని విష్ణు కళాశాలలో జిల్లా స్థాయి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు.

News March 7, 2026

6 వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్’, అజీవికా మిషన్ పథకాలపై జిల్లావ్యాప్తంగా ఆరు వారాల పాటు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి ఈ పథకాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధి అవకాశాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ ప్రచార లక్ష్యమని తెలిపారు.

News March 6, 2026

ఆక్వా రైతుల నమోదును వేగవంతం చేయాలి: జేసీ

image

జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ, తూనికలు-కొలతలు, వాణిజ్య పన్నులు, ఎంపెడ అధికారులతో సమీక్షించారు. ఆక్వా రైతులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే, ఆక్వా ఫీడ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.