News April 15, 2025
తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ మనదే: KMR ప్రోగ్రాం అధికారి

కామారెడ్డిలోని రాజీవ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డా.అనురాధ మంగళవారం సందర్శించారు. ల్యాబ్, ఫార్మసీ గదులను పరిశీలించారు. రిజిస్టర్లను, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ఆరోగ్య సిబ్బందిదేనని ఆమె అన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలపై సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News April 19, 2025
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు టామ్ చాకో అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ మత్తులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ నటి ఫిర్యాదు చేయడంతో కేరళ పోలీసులు ఆయన ఉన్న హోటల్‌పై రైడ్ చేశారు. వారిని చూసి చాకో పరారయ్యారు. అప్పటి నుంచి ఆయన కోసం గాలింపు చేపట్టి, తాజాగా కొచ్చిలో అదుపులోకి తీసుకున్నారు. చాకో తెలుగులో దసరా, దేవర, రాబిన్‌హుడ్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
News April 19, 2025
ఉమ్మడి కడప జిల్లాలో దారుణ ఘటన

ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలంలో మతిస్థిమితం లేని మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళపై వెంకటరమణ లైంగిక దాడికి యత్నించాడు. బయట ఆడుకుంటున్న పిల్లలు ఇది గమనించి కేకలు వేయగా నిందితుడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News April 19, 2025
ఈ ఏడాది చివర్లో ఇండియాకు వస్తా: మస్క్

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటిస్తానని ఆయన రాసుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన <<16137981>>ట్వీట్‌కు<<>> ఆయన రిప్లై ఇచ్చారు. కాగా, మస్క్‌కు చెందిన టెస్లా, స్టార్‌లింక్ కంపెనీలు త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.