News April 15, 2025
వనపర్తి జిల్లాలో TODAY TOP NEWS

✔️అమరచింత: సాగునీరు కావాలంటూ రైతుల రాస్తా రోకో కార్యక్రమం. ✔️ WNP: GREAT పోలీస్… యువకుడి ప్రాణాలు కాపాడారు. ✔️ రేవల్లి: పొట్టేళ్ల బండి పై స్వారీ చేసిన మాజీ మంత్రి. ✔️ WNP: పాలిటెక్నిక్ చౌరస్తా వద్ద డివైడర్లు ఏర్పాటు. ✔️ WNP: POCSO యాక్ట్ పై అవగాహన
✔️పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి
Similar News
News July 5, 2025
ఉత్కంఠ మ్యాచ్.. భారత్ ఓటమి

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 171 రన్స్ చేసింది. ఓపెనర్లు సోఫియా 75, వ్యాట్ 66 రన్స్‌తో రాణించారు. ఛేదనలో భారత ఓపెనర్లు మంధాన 56, షఫాలీ 47 రన్స్ చేసి అద్భుత ఆరంభాన్నిచ్చినా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 5 రన్స్ తేడాతో ఓడిపోయింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి 2 గేమ్స్ గెలిచిన టీమ్ ఇండియా 2-1తో లీడ్‌లో ఉంది.
News July 5, 2025
జనగామ: IIIT బాసరకు 8 మంది విద్యార్థినులు!

జనగామ జిల్లా కొడకండ్ల TGRS(G) నుంచి 8 మంది విద్యార్థినులు IIIT బాసరకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన హారిక, మోక్షజ్ఞ, వైష్ణవి, ఇందు, కార్తీక, శ్రీజ, నాగేశ్వరి, వేదన సీటు సాధించినట్లు చెప్పారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయ బృందంతో పాటు తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News July 5, 2025
బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన జనగామ విద్యార్థిని

జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన మేడారం రుచిక బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కృష్ణమూర్తి తెలిపారు. అంబేడ్కర్ నగర్‌లోని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మేడారం రవి, రాధ దంపతుల కూతురు రుచిక ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడంపై స్థానికులు అభినందించారు.