News April 15, 2025

కృష్ణా: ధాన్యం సేకరణకు 128 మిల్లులకు అనుమతులు

image

ఖరీఫ్ మిగులు ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సేవ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. 128 రైస్ మిల్లులకు ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చామన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచామన్నారు.

Similar News

News January 4, 2026

గన్నవరంలో రేపు సబ్‌స్టేషన్‌ ప్రారంభం.. మంత్రుల రాక

image

AP ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 132/33 KV గన్నవరం విమానాశ్రయ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సోమవారం ప్రారంభించనున్నారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లోటును అధిగమించేందుకు ఈ సబ్‌స్టేషన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు వాసంశెట్టి, కొల్లు, గన్నవరం MLA యార్లగడ్డ పాల్గొననున్నారు.

News January 4, 2026

కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ‘శ్రీరామ్మూర్తి’

image

కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు అందే శ్రీరామ్మూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన అవనిగడ్డ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్మూర్తి నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.