News April 15, 2025

చందనోత్సవంపై మంత్రుల సమీక్ష

image

విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం విశాఖలో పర్యటిస్తారు. సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయశాఖ, జిల్లా అధికారులతో ఉదయం 11గంటలకు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొనున్నారు. వీటికి తగ్గట్టు జిల్లా అధికారులు, దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News April 16, 2025

ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ: మంత్రి

image

రెవెన్యూ స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కారానికై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించిందని రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ పేర్కొన్నారు. విశాఖ‌ క‌లెక్ట‌రేట్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమావేశమయ్యారు.రీ సర్వేపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, 22ఏ తొలగింపునకు దరఖాస్తులు వస్తున్నాయని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ వివరించారు.

News April 16, 2025

విశాఖ: అవిశ్వాస తీర్మానం నోటీసు తిరస్కరణ

image

జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు చెల్లదని ఇన్ ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సెక్షన్ 91 ఏ, పురపాలక చట్టం 1955 ప్రకారం నోటీసును తిరస్కరించినట్లు వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం నాలుగేళ్లు పూర్తి కాకుండా అవిశ్వాసం పెట్టడం వీలుకాదన్నారు. సతీశ్ 2021 జూలై 30న‌ బాధ్యతలు స్వీకరించారన్నారు.

News April 16, 2025

ఇళ్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల స్వీకరణ: విశాఖ జేసీ

image

విశాఖలో ఇళ్ల క్రమబద్ధీకరణ జీవో నంబర్ 30 కింద దరఖాస్తుదారులు సమీప గ్రామ, వార్డు సచివాలయలలో అందజేయాలని జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ తెలిపారు. నిర్దేశిత డాక్యుమెంట్లతో పాటు, వార్షికాదాయం గ్రామాల్లో రూ.1,20,000, పట్టణాల్లో రూ.1,44,000గా ఉండాలన్నారు. ఖాళీస్థలాలు, పూరిగుడిసెల క్రమబద్ధీకరణకు అనర్హమని అన్నారు. కుటుంబంలో స్త్రీ పేరున దరఖాస్తు చేయాలని సూచించారు.

error: Content is protected !!