News April 15, 2025
పంజాబ్‌పై వికెట్ల‘కింగ్’గా ఆవిర్భవించిన నరైన్!

ముల్లాన్‌పూర్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ నరైన్ ఐపీఎల్ రికార్డులకెక్కారు. ఈ మ్యాచ్‌లో ఆయన 2 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆ జట్టుపై ఆయన తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 36కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలరైనా ఓ ప్రత్యర్థి జట్టుపై ఇన్ని వికెట్లు తీయడం ఇదే అత్యధికం.
Similar News
News April 16, 2025
100రోజులు కాకముందే పెను విధ్వంసం: జో బైడెన్

వృద్ధాప్య అమెరికన్లకు కనీస ఆదాయం అందించే సోషల్ సెక్యూరిటీ ఏజెన్సీ నిధులను US ప్రభుత్వం తగ్గించిందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. DOGE పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఫైరయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం 100రోజుల పాలన కాకముందే ప్రభుత్వం చరిత్రలో చూడని విధ్వంసం, నష్టం సృష్టించిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ప్రసంగించారు.
News April 16, 2025
‘రాజీవ్ యువ వికాసం’ నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్: భట్టి

TG: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకం నిరుద్యోగుల పాలిట గేమ్ ఛేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బ్యాంకర్లు ముందుకు వస్తే యువత ఆర్థికంగా ఎదుగుతారని, రూ.6వేల కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై కలెక్టర్లు, బ్యాంకర్లతో సమావేశాలు ఉంటాయని తెలిపారు. కాగా ఈ పథకం దరఖాస్తు గడువు ఈ నెల 14తో ముగిసింది.
News April 16, 2025
గురూజీకి తమిళ హీరో షాక్?

అల్లు అర్జున్-అట్లీ సినిమా ఖరారు కావడంతో ఈ గ్యాప్‌లో ఓ సినిమా చేయడంపై డైరెక్టర్ త్రివిక్రమ్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలో తమిళ హీరో శివకార్తీకేయన్‌కు ఆయన కథ చెప్పగా రెమ్యునరేషన్ రూ.70 కోట్లు అడిగినట్లు సమాచారం. ఇంత అమౌంట్ వెచ్చిస్తే వర్కౌట్ కాదని త్రివిక్రమ్ ఆసక్తి కనబరచనట్లు టాక్. దీంతో ప్రస్తుతం ఆ సినిమాను చేయట్లేదని తెలుస్తోంది. మరోవైపు వెంకీకి గురూజీ కథ చెప్పగా ఆయన ఓకే చెప్పాల్సి ఉంది.