News April 15, 2025
విజయనగరం వరకే గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్

పార్వతీపురం-సీతానగరం లైన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్ల గమ్యాన్ని కుదించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21 నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News November 5, 2025
ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం: వైసీపీ

ఏలూరులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైసీసీ X ఖాతాలో పేర్కొంది. మద్యం తాగించి..లైంగిక దాడికి పాల్పడినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలిక ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు వైసీసీ ట్వీట్ చేసింది. ఈ ఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందనేది తెలియాల్సి ఉంది.
News November 5, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: డ్రోన్లకు పర్మిషన్ ఇవ్వండి!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో తమ పార్టీ అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్ రావులు పాల్గొంటున్నారని.. వారి భద్రత దృష్ట్యా డ్రోన్లు వాడుతామని బీఆర్ఎస్ నాయకులు సీపీ సజ్జనార్‌ను కోరారు. స్థానికంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగిస్తామని సీపీకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించలేదని సమాచారం. మరి పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
News November 5, 2025
అసెంబ్లీ స్పీకర్ ముందుకు రేపు జగిత్యాల MLA సంజయ్

పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ విడతలవారీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి నుంచి రెండో విడతలో నలుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణకు స్వీకరించనున్నారు. ఈ మేరకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను గురువారం విచారించనున్నారు. ఇరువర్గాల అడ్వకేట్ల సమక్షంలో ఈ విచారణ జరగనుంది.


