News April 15, 2025
విజయనగరం వరకే గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్

పార్వతీపురం-సీతానగరం లైన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు వలన పలు రైలు గమ్యాన్ని కుదించడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుంది.
Similar News
News April 16, 2025
విశాఖ: దివీస్ ఉద్యోగి మృతి

దివీస్‌లో పనిచేస్తున్న మధు మోహాన్ మంగళవారం మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన మోహన్ దివీస్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 16, 2025
కైలాసపట్నం: క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న జల్లూరి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకల జానకిరామ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు మంగళవారం తెలిపారు. వి.సంతోషి, వి షారోని, వి.రాజును త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.
News April 16, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

పార్వతీపురం-సీతానగరం మధ్య ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ (53587/88), విశాఖ-రాయపూర్(55827/28), విశాఖ-కోరాపుట్ వీక్లీ ఎక్స్ ప్రెస్(18511/12 ) రైళ్లు ఈనెల 22 నుంచి మే 5 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.