News April 15, 2025
ఈ ఆహారం తినే పురుషులు జాగ్రత్త!

ప్రాసెస్డ్ & జంక్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్, పిజ్జాలు తినే పురుషుల్లో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల ప్రభావం వల్ల స్త్రీలలో ఈ రిస్క్ తక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉన్న పురుషులు టెస్టులు చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. కాగా బ్రిటన్‌లోని పురుషులు, స్త్రీలపై 28ఏళ్ల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
Similar News
News January 5, 2026
SBIలో 1146 జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగించారు. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. వయసు పోస్టును బట్టి 20-45 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L చెల్లిస్తారు.
సైట్: <
News January 5, 2026
చలి తీవ్రతతో కోళ్లకు పెరుగుతున్న ముప్పు

చలి గాలులు, పొగ మంచు వల్ల రాత్రి వేళ కోళ్ల షెడ్లలో తేమ అధికమై అది ఆవిరి కాకుండా ఉండిపోతుంది. దీని వల్ల కోళ్లలో శ్వాస సంబంధ వ్యాధుల ముప్పు, లిట్టర్‌లో తేమ శాతం పెరగడం వల్ల పరాన్నజీవులు, శిలీంధ్రాల బెడద పెరుగుతుంది. చలికి కోళ్లు ఒత్తిడికి లోనవడం వల్ల వాటిలో వ్యాధి నిరోధకత శక్తి తగ్గి CRD, ఐబీ, కొక్కెర రోగం, బ్రూడర్ న్యుమోనియా, కోకిడియోసిస్ వ్యాధుల ముప్పు పెరిగి కోళ్ల మరణాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.
News January 5, 2026
నీళ్లు వృథా కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు: సీఎం చంద్రబాబు

AP: ఏటా కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలుగు మహా సభలో సీఎం చంద్రబాబు తెెలిపారు. అందుకే ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇప్పుడూ నీళ్లు వృథా కాకుండా ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలని సీఎం చెప్పారు. గంగా-కావేరీ, గోదావరి-పెన్నా నదులు కలవాలన్నారు.


