News April 16, 2025

కొత్త ఆర్ఓఆర్ చట్టాలపై అవగాహన కల్పించాలి: VKB కలెక్టర్

image

భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కొత్త ఆర్ఓఆర్ చట్టంపై తహశీల్దార్‌లతో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసు చంద్రతో కలిసి సమీక్ష నిర్వహించారు.  

Similar News

News September 15, 2025

విడాకులు తీసుకున్న వారితో నాకు పెళ్లి అనేవారు: మీనా

image

తనపై గతంలో వచ్చిన వార్తలను జగపతి బాబు షోలో సీనియర్ నటి మీనా గుర్తు చేసుకున్నారు. ‘అప్పుల్లో ఉన్నామని తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్మాతలు అడిగేవారు. అలా తీసిన సినిమాలు హిట్ అయ్యాక నన్ను మర్చిపోయేవాళ్లు. వరుస అవకాశాలు ఉన్నప్పటికీ నేను పెళ్లి చేసుకున్నాను. 2022లో భర్తను కోల్పోయాక ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్నా నాతో పెళ్లి అని వార్తలొచ్చేవి. అవి చూసినప్పుడు బాధేసేది’ అని చెప్పారు.

News September 15, 2025

HNK: ఐటీఐ కళాశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ప్రభుత్వ ఉపాధి కల్పన శిక్షణ శాఖ, ఐటీఐ హనుమకొండ, ATC/ITIలో మిగిలిన సీట్లకు ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ జి సక్రు ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విధ్యా సంవత్సరానికి గాను 4th Phase వాక్ ఇన్(స్పాట్) అడ్మిషన్ల గడువును ఈనెల 30న వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు. వివరాలకు మొబైల్ 9490855355, 9908315560ను సంప్రదించాలని అన్నారు.

News September 15, 2025

గుత్తి: 5 టన్నుల టమాటాలు పారబోశారు..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయి. కనీసం ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. గుత్తికి చెందిన రైతులు 500 బాక్సులను మార్కెట్‌కు తీసుకు వచ్చారు. కిలో రూ.5, రూ.3 మాత్రమే పలకడంతో ఇలా హైవే పక్కన టమాటాలను రైతులు పారబోశారు.