News April 16, 2025
‘స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దతు’

స్టీల్ ప్లాంట్ కార్మికులు 16వ తేదీ నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెకు అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీఐటీయూ ఆఫీసులో మంగళవారం జరిగిన సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశంపై ఎంపీ, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాలన్నారు. 18న గాజువాకలో, 19న నగరంలో కాంట్రాక్టు కార్మికుల ప్రదర్శనల్లో పాల్గొంటామన్నారు. సీఐటీయూ నాయకులు కుమార్, ఎఐటియుసి మన్మధరావు పాల్గొన్నారు.
Similar News
News April 16, 2025
విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరాడు. బుధవారం ఉదయం హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి అని కాలేజీ సిబ్బంది తెలిపారు.
News April 16, 2025
భీమిలి: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం

విశాఖలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. షిప్పింగ్ యార్డ్ ప్రాంతానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలోని ఓ కాలేజీ ఎదురుగా ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళ స్టేషన్ ఏసీపీ పెంటా రావు సంఘటన స్థలాన్ని బుధవారం పరిశీలించారు.
News April 16, 2025
విశాఖ: దివీస్ ఉద్యోగి మృతి

దివీస్‌లో పనిచేస్తున్న మధు మోహాన్ మంగళవారం మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన మోహన్ దివీస్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకొని హాస్టల్‌కి వచ్చాడు. అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.