News April 16, 2025
భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై తహశీల్దార్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యశారదా దేవి పాల్గొన్నారు. భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత తహశీల్దార్లకు కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ జి సంధ్యా రాణి తదితరులున్నారు.
Similar News
News November 2, 2025
గీసుకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

గీసుకొండ మండలం మొగిలిచర్లలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక అప్ప నాగరాజు (34) అనే ఆటో డ్రైవర్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితులు దిగజారడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
News November 2, 2025
సంగెం: గుంతలో పడి వృద్ధుడి మృతి

సంగెం మండలం లోహిత గ్రామంలోని నల్లాల గేట్‌వాల్ సమీపంలో ఉన్న గుంతలో పడి గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 ఏళ్లు) మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి గుర్తింపు కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
News November 2, 2025
వరంగల్: కబ్జాలతో కష్టాలు

వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. దీనికి ప్రధాన కారణం వర్షం కాదని, నాలాలు, కాలువలు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు నగరానికి అందాన్ని తెచ్చిన 170కి పైగా చెరువులు, కుంటలు ఇప్పుడు అర్ధభాగం వరకు మాయం అయ్యాయని, మురికి కాలువలపై కొందరు అక్రమార్కులు భవనాలు, షాపులు నిర్మించుకుని ప్రజా భద్రతను సవాల్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.


