News April 16, 2025
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు

ఉప్పల్ పీహెచ్సీలో టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 750 టీబీ రోగులకు 1,500 పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ, టిబి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చని అధికారులు తెలిపారు.
Similar News
News April 16, 2025
ఫైబర్‌నెట్‌లో ఉద్యోగుల తొలగింపు

AP ఫైబర్‌నెట్‌లో ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమించిన వారంతా ఈ నెలాఖరులోగా రిలీవ్ కావాలని ఆదేశించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. తొలగించిన వారిలో 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫైబర్‌నెట్ నియామకాలు ఇష్టారీతిన జరిగాయని, కొందరు ఆఫీసులకు రాకుండానే జీతాలు తీసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
News April 16, 2025
విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరాడు. బుధవారం ఉదయం హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి అని కాలేజీ సిబ్బంది తెలిపారు.
News April 16, 2025
చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా చేయాలి: కలెక్టర్

కోనసీమ జిల్లాలో చిట్ట చివరి ఆయకట్టు వరకు పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జలవనరులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.