News April 16, 2025
మంచిర్యాల కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న భూ భారతిపై నిర్వహించే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొంటారని జన్నారం తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడారు. జన్నారం రైతు వేదికలో బుధవారం ఉదయం 10 గంటలకు భూ భారతిపై నిర్వహించే సదస్సులో కలెక్టర్ పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News September 14, 2025
రూ.81 వేల వరకు జీతం.. ఇవాళే లాస్ట్!

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ చేసినవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయసు 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జీతం రూ.25,500 నుంచి రూ.81,100(అలవెన్సులు అదనం) వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్‌సైటును సంప్రదించగలరు.
News September 14, 2025
భారీ బహిరంగ సభ.. నేడు విశాఖకు జేపీ నడ్డా

AP: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించే సారథ్య యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వెల్లడించారు. ఈనెల 17న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కూడా విశాఖలో పర్యటిస్తారని తెలిపారు. అలాగే అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఖాదీ సంత నిర్వహించబోతున్నట్లు ప్రెస్‌మీట్‌లో తెలిపారు.
News September 14, 2025
OG మూవీలో నేహాశెట్టి సర్‌ప్రైజ్

పవన్ కళ్యాణ్ ‘OG’మూవీపై హైప్ అంతకంతకూ పెంచేస్తున్నారు. తాజాగా ఇందులో ఓ ఐటమ్ సాంగ్ ఉందని క్లారిటీ వచ్చింది. DJ టిల్లు మూవీ ఫేమ్ నేహాశెట్టి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని స్వయంగా హీరోయినే కన్ఫమ్ చేశారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ‘OG’లో సర్‌ప్రైజ్ ఉంటుందని వెల్లడించారు. కేవలం సాంగ్ మాత్రమే కాకుండా.. పవన్‌తో కీలక సన్నివేశాల్లోనూ నటించినట్లు తెలుస్తోంది.