News April 16, 2025
టీయూ పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

టీయూ పరిధిలోని పీజీ & ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ APE, IMBA, IPCH కోర్సుల I,&IIIవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ వీసి ప్రొ.యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి చేతుల మీదుగా మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్‌లో చూడాలన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.సంపత్ కుమార్, అడిషనల్ కంట్రోలర్ ప్రొ.సంపత్, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ ఉన్నారు.
Similar News
News July 4, 2025
మొహర్రం పర్వదినం.. తిరుపతి ఎస్పీ విజ్ఞప్తి

మొహర్రం పర్వదినం సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రహదారులపై బైక్ ర్యాలీలు, మితిమీరిన శబ్దంతో డీజేలపై నిషేధం ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో మొహర్రం పండుగను చేసుకోవాలని ఆయన కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News July 4, 2025
జగిత్యాల: ‘వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి’

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్‘ ( మన తల్లి పేరిట ఒక మొక్క నాటుదాం) కార్యక్రమాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం అయన ప్రారంభించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని సహకార సంఘాల పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.
News July 4, 2025
కాసేపట్లో మోస్తరు నుంచి భారీ వర్షం: వాతావరణ కేంద్రం

TG: కాసేపట్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత అరగంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, MBNR, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.