News April 16, 2025

బాల్య వివాహాలు జరగకుండా చూడాలి: జిల్లా కలెక్టర్

image

పాఠశాలల్లో 10వ తరగతి చదువు పూర్తయిన తరువాత ఇంటికి వెళ్ళిపోయే 18ఏళ్ళ లోపు బాలికలపై ప్రత్యేక దృష్టి సారించి, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలను గ్రామ స్థాయిలోనే గుర్తించాలని, పరిష్కరించలేని సమస్యలను తన దృష్టికి తీసుకు రావాలన్నారు. గ్రామ, మండల, డివిజనల్ స్థాయిలో సమర్థంగా పని చేయాలన్నారు.

Similar News

News September 17, 2025

విశాఖ: మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థి బుధవారం మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లాకు చెందిన విస్మద్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News September 17, 2025

సూర్యాపేట-గరిడేపల్లి హైవేపై యాక్సిడెంట్

image

గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫతేపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ టీవీఎస్‌ ఎక్సెల్‌పై ప్రయాణిస్తుండగా సూర్యాపేట-గరిడేపల్లి రహదారిపై లారీ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 17, 2025

ఏడాదికి రూ.50వేల స్కాలర్‌షిప్.. APPLY

image

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో AICTE ప్రగతి స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ చదువుతున్నవారు OCT 31 వరకు <>ఆన్‌లైన్‌లో<<>> దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన తర్వాత ఏడాదికి రూ.50వేల చొప్పున డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్ విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తారు. SHARE IT.