News April 16, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. ఇద్దరి మృతి 

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకొండ నుంచి  చారకొండ మధ్యలో ఎర్రగుంటపల్లి వద్ద బైక్‌పై వస్తున్న ఇద్దరిని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మరణించారు. మృతులు కార్తీక్ చారి సబ్ స్టేషన్‌లో పనిచేస్తుండగా అరవింద్ చారి బస్టాప్ వెనుక మీల్స్ హోటల్ నడుపుతున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 14, 2026

పండగ పూట.. హసన్‌పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి వద్ద హైవే పనులు చేస్తున్న టిప్పర్ ఢీకొనడంతో కేశవాపూర్‌కు చెందిన పాల వ్యాపారి ఈర కుశుడు (38) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజ్జైంది. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం విషాదంగా మారింది. కుశుడికి భార్య స్నేహ, పిల్లలు ఉన్నారు.

News January 14, 2026

549 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

BSF స్పోర్ట్స్ కోటాలో 549 కానిస్టేబుల్(GD) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్ పాసై, శారీరక ప్రమాణాలు కలిగి, జాతీయ, అంతర్జాతీయ స్థాయులో క్రీడల్లో రాణిస్తున్నవారు అర్హులు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. PST, స్పోర్ట్స్ ప్రదర్శన, CV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే రూ.21,700-69,100. వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 14, 2026

సంప్రదాయ రుచుల సంక్రాంతి సంబరం

image

సంక్రాంతి అంటేనే పిండివంటల ఘుమఘుమలు. ఈ పండుగ నాడు పాలు పొంగించి చేసే పొంగలితో పాటు పరమాన్నం, పులిహోర, గారెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంప్రదాయాలకు ప్రతీకగా అరిసెలు, బూరెలు, జంతికలు, సకినాలు, మురుకులు, లడ్డూలు చేసుకుంటారు. ఈ వంటలన్నీ ఇంటిల్లపాదికి సంతోషాన్ని పంచుతాయి. భోగభాగ్యాలతో, కొత్త ధాన్యపు రాశులతో ప్రతి ఇంటా సిరిసంపదలు కురిపిస్తూ, కొత్త కాంతులను విరజిమ్మాలన్నదే ఈ పండుగ ఇచ్చే సందేశం.