News April 16, 2025

భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

భూ భారతి చట్టంపై మండలాల్లో అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఆలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆర్డీవోలు,తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులతో భూ భారతి చట్టం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు.

Similar News

News April 16, 2025

రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

image

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడంతో రోడ్లు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ధాన్యంపై మోటార్ సైకిల్ వెళ్తే స్కిడ్ అయ్యి పడే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయాల్లో రోడ్డుపై ధాన్యం కుప్పలు చేసి బండరాళ్లు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలుకు గురవతున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

News April 16, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచుపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రేగోడ్ మండలంలోని పట్టెపొలం తండాకు చెందిన లావుడియా సక్రీ బాయి, సుభాష్ బైక్‌పై వెళ్తున్నారు. నిజాంపేట్ మండలం బాచుపల్లి శివారులో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 15, 2025

మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వివరాలు.. సంగారెడ్డి ఓఆర్ఆర్ పై టెంపో వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ మాదయ్య మృతి చెందాడు. కొల్లూరులో బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ప్రభాకర్ మృతి చెందగా, పుల్‌కల్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో అల్లాదుర్గం(M)కు చెందిన జర్నయ్య బైక్ పై వస్తూ లారీని ఢీకొట్టి మృతి చెందాడు. కొండపాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా వాసి అనిల్ మృతి చెందాడు.

error: Content is protected !!