News April 16, 2025
శ్రీ సత్యసాయి: కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించిన SP

నియోజవర్గ కేంద్రమైన మడకశిరలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారస్తుల సహకారంతో సీసీ కెమెరాలు పట్టణమంతా ఏర్పాటు చేశారు. ప్రస్తుత కాలంలో నేరాలు అదుపు చేయడంలో, నేరస్తులను కనిపెట్టడంలో సీసీ కెమెరాలు వినియోగం ఎంతో అవసరమని ఎస్పీ పేర్కొన్నారు. సీసీ కెమెరాలు స్వచ్ఛందంగా అందజేసిన దాతలను ఎస్పీ మంగళవారం సన్మానించారు.
Similar News
News November 6, 2025
పసుపులో ముర్రాకు తెగులు, దుంపకుళ్లు.. నివారణకు సూచనలు

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పసుపు పంటలో ముర్రాకు తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని రోజుల్లోనే పొలమంతా విస్తరిస్తుంది. అందుకే తెగులు ఆశించిన ఆకులను తుంచి కాల్చివేయాలి. థయోఫానైట్ మిథైల్ 2 గ్రా. లేదా ప్రొపికొనజోల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. అలాగే దుంపకుళ్లు నివారణకు లీటరు నీటికి మెటలాక్సిల్+మ్యాంకోజెబ్ 3గ్రా. చొప్పున కలిపి మొక్కల మొదళ్లను తడపాలి.
News November 6, 2025
డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: సీఎం

AP: డేటా ఆధారిత పాలన ఎంతో కీలకమని CM చంద్రబాబు తెలిపారు. తుఫాను సమయంలో టెక్నాలజీ సాయంతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించామన్నారు. పాలనలో ఆధునిక టెక్నాలజీ, RTGSతో సమన్వయంపై అధికారులు, మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ‘అందుబాటులో ఉన్న డేటాను రియల్‌టైమ్‌లో ప్రాసెస్ చేస్తున్నాం. దీన్ని విస్తరించాలి. డిజిలాకర్‌లో విద్యార్థుల సర్టిఫికెట్లు, రోగుల హెల్త్ రికార్డులు అందుబాటులో ఉండాలి’ అని సూచించారు.
News November 6, 2025
స్టేషన్‌ఘన్‌పూర్ డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా గురువారం స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు. ఆయన కళాశాల రికార్డులను పరిశీలించి, లెక్చరర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట ఆర్డీవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.


