News April 16, 2025
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 180 పోస్టులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 180 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 71 SGT(ప్రాథమిక స్థాయి), 109 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Similar News
News April 17, 2025
టెక్కలిలో ఓ వ్యక్తి సూసైడ్

టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 7వ లైన్‌లో నివాసముంటున్న ముడిదాన కేశవరావు(38) అనే వ్యక్తి బుధవారం రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. నందిగాం మండలం హుకుంపేటకు చెందిన ఈయన టెక్కలిలో ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య కొన్నేళ్ల క్రితం మృతిచెందగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని టెక్కలి పోలీసులు పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News April 16, 2025
రణస్థలం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

డెంకాడ (M) చొల్లంగిపేట జంక్షన్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రణస్థలం (M) NGRపురానికి చెందిన జగిలి రామప్పడు(54) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామప్పడు తన భార్య మహాలక్ష్మితో కలిసి బైక్‌పై గజపతినగరం(M) గంగచోల్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. చొల్లంగిపేట జంక్షన్‌కి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో రామప్పడు అక్కడికక్కడే మృతి చెందారు.
News April 16, 2025
SKLM: అశ్లీల స్ట్రీమింగ్ ముఠా అరెస్ట్

నిషేధిత వెబ్‌సైట్‌లపై లైవ్ న్యూడ్ వీడియోలు ప్రసారం చేస్తున్న సిక్కోలుకు చెందిన ఇద్దరిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఐజీ రవికృష్ణ తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం, గుంతకల్లుకు చెందిన ముగ్గురు నిందితులు గణేశ్, జ్యోత్స్న, లౌయిస్ అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 3 కేసులు నమోదు చేశారు. ముఠా మరెంత మంది బాధితులను టార్గెట్ చేసిందన్న విషయంపై విచారణ సాగుతోంది.