News April 16, 2025
KMR: భూగర్భ జలాల సంరక్షణపై కలెక్టర్ మీటింగ్

జిల్లాలో భూగర్భ జలాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో నీటి కొరత నివారణకు ఫామ్ పాండ్స్, బోరవెల్లి రీచార్జ్, ఇంకుడు గుంతలు, సోక్పిట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షపు నీటిని భూమిలోకి చొప్పించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, భూగర్భ జలాధికారి సతీష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 26, 2025
కామారెడ్డి చలి ప్రభావం.. స్థిరంగా ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. రామలక్ష్మణపల్లి 9.6°C, గాంధారి 9.9, జుక్కల్ 10.2, మేనూర్ 10.3, మాక్దూంపూర్ 10.4, సర్వాపూర్ 10.7, లచ్చపేట, పెద్దకొడప్గల్ 10.8, నాగిరెడ్డిపేట, మాచాపూర్ 11, బీర్కూర్, బిచ్కుంద, ఎల్పుగొండ, డోంగ్లి 11.1, రామారెడ్డి, నస్రుల్లాబాద్ 11.2, బొమ్మన్ దేవిపల్లి 11.3, పిట్లం, భిక్నూర్, ఇసాయిపేట, పుల్కల్ 11.4°C.
News December 26, 2025
మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు

మహబూబాబాద్ జిల్లా డిడిఎన్ (దేవాలయ ధూప, దీప నైవేద్య) అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడిగా లింగోజు వెంకటేశ్వరచారిని ఎన్నుకున్నట్లు కమిటీ తెలిపింది. మహబూబాబాద్ బ్రహ్మంగారి దేవాలయంలో జరిగిన ధూప దీప నైవేద్య అర్చకుల ఎన్నికలలో మరిపెడ బంగ్లా ఎల్లంపేటకి చెందిన లింగోజు వెంకటేశ్వర ఆచారి 43ఓట్లతో గెలుపొందారు. వెంకటేశ్వర ఆచారికి పలువురు అభినందనలు తెలిపారు.
News December 26, 2025
శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగాలు

శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్లు(శానిటేషన్), నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు(ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కమిషనర్ భవాని ప్రసాద్ తెలిపారు. జనవరి 6వ తేదీ సాయంత్రం 5గంటల లోపు అప్లికేషన్లు సమర్పించాలని కోరారు. పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు రూ.21వేలు, నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నెలకు రూ.18,500 జీతం ఉంటుందని చెప్పారు. కనీసం 7వ తరగతి అర్హత ఉండాలన్నారు.


