News April 16, 2025
అనకాపల్లి: గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేసామని రావికమతం ఎస్ఐ ఎం.రఘువర్మ మంగళవారం తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి కాలినడకన 8 కిలోల గంజాయితో తమిళనాడుకు చెందిన మహిళతో పాటు మరొక పురుషుడు, ప్రయాణిస్తున్నారని సమాచారం మేరకు రావికమతం పొలిమేరలో సిబ్బందితో తనిఖీ చేపట్టగా గంజాయితో సహా ఇరువురు పట్టుబడినట్లు తెలిపారు.
Similar News
News October 28, 2025
మచిలీపట్నానికి 70kmల దూరంలో తుఫాన్

AP: బంగాళాఖాతంలో మొంథా తుఫాన్ గంటకు 15km వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 70 km, కాకినాడకు 150 km, విశాఖపట్నానికి 250 km దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 90-110కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు.
News October 28, 2025
తుఫానుపై ఏలూరు జిల్లా పోలీస్ అప్రమత్తం

తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటమే పోలీసుల కర్తవ్యం అని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. జిల్లా ప్రజల కోసం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. రెస్క్యూ టీమ్‌లు, డ్రోన్లను వినియోగిస్తాయని, అత్యవసరమైతే 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, తద్వారా తక్షణ సహాయం అందుతుందని ఆయన సూచించారు.
News October 28, 2025
కుప్పకూలిన విమానం.. 12 మంది సజీవదహనం

కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయి మంటలు వ్యాపించడంతో 12 మంది సజీవ దహనమయ్యారు. ఇవాళ ఉదయం టూరిస్టులతో డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తుండగా సింబా గోలిని ఏరియాలో కుప్పకూలినట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. పోలీసు, ఎమర్జెన్సీ సర్వీసెస్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.


