News March 27, 2024
ఆనం వివాదాస్పద ట్వీట్

సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి బుధవారం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈక్రమంలో విజయమ్మ సీఎం జగన్‌ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. సంబంధిత ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వివాదాస్పదంగా స్పందించారు. ‘చెల్లిని ఏమీ చేయవద్దు’ అనే క్యాప్షన్‌తో ఆ ఫొటోను ట్వీట్ చేశారు.
Similar News
News February 16, 2026
ఉదయగిరి జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన జన్నత్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి ఉదయగిరి ఉపసర్పంచ్ షేక్ ముత్తూజా హుస్సేన్ తమ్ముడుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 16, 2026
నెల్లూరు: అడవిలో తప్పిపోయిన 12 మంది భక్తులు సేఫ్

రాపూరు (M) పంగిలి గ్రామ సమీపంలోని మామిడికొనలో ఉన్న వెలసిన శ్రీ మల్లయ్యస్వామి వారి దర్శనార్థం నెల్లూరు సిటీ అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది టెంపోలో వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పంగిలి గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో చీకటి కారణంగా 12 మంది దారి తప్పిపోయారు. పోలీసులు గాలించి వారిని బంధువులకు అప్పగించారు.
News February 16, 2026
చంద్రబాబు బడ్జెట్ అంతా మోసం, అబద్ధాలు : కాకాణి

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషాదకరమని, ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందన్నారు. వైసీపీ హయాంలో ఐదు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆమోదయోగంగా ఉందన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం వెనకడుగు వేయకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమన్నారు.


