News April 16, 2025
ధరూర్: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి’

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. బుధవారం కేటీదొడ్డి మండలం ముత్యాల, ధరూర్ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ నమూనాను పరిశీలించారు. ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్న మెటీరియల్, క్వాలిటీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు.
Similar News
News September 19, 2025
సంగారెడ్డి: ప్రమాదాలు జరగకుండా చూడాలి: ఎస్పీ

నేషనల్ హైవే 161 రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎస్పీ పారితోష్ పంకజ్ ఆదేశించారు. పుల్కల్ మండల పరిధిలోని నేషనల్ హైవే ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాల వేగం అదుపు చేసేందుకు ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు.
News September 19, 2025
20న జనగామలో ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20న జనగామ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ క్రీడా ఎంపికలు జరుగుతాయి. ప్రతి కళాశాల నుంచి ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని క్రీడల కన్వీనర్ అజ్మీర కిషన్ తెలిపారు.
News September 19, 2025
పాకిస్థాన్ ఓవరాక్షన్‌పై ICC సీరియస్!

ఆసియా కప్: యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓవరాక్షన్ వల్ల మ్యాచ్ గంట ఆలస్యమైన విషయం తెలిసిందే. ఆ రోజు రూల్స్ అతిక్రమించారని PCBకి ICC లేఖ, ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. స్టేడియంలో వీడియో రికార్డ్ చేసి వారి SM ఖాతాల్లో పోస్ట్ చేయడంపై కూడా సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలోనే PCBపై చర్యలు తీసుకునేందుకు ICC సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.